Friday 29 November 2013

కె.ఎన్.వి.ఎం.వర్మ//నాలోనే//

//నాలోనే//


చేను
కాలనీగా మారి
ఊరు
పట్టణం వేషం కట్టింది

ఆవు
అల్ కబీర్ చేరి
పొట్టలోని
ప్లాస్టిక్ పుట్ట బయటపెట్టింది

ప్రపంచం
వసుధైక కుటుంబంగా మారి
పక్కింటి
తలుపు మూసుకుంది

ప్రేమ
పార్కు పొదలో దూరి
అవయవాలలో
నగ్నంగా తనని చూసుకుంటోంది

మనసు
మనుషులతో పోరి
జనారణ్యంలో
అడివిని వెదుక్కోంటొంది

నేను
నాలోనే ఏమారి
నీలో
మార్పు కోసం కలగంటోంది....18.11.2013.

కె.ఎన్.వి.ఎం.వర్మ// ఏక్ పురానా షాయరీ //

కె.ఎన్.వి.ఎం.వర్మ// ఏక్ పురానా షాయరీ //


నా గుల్ కిల్తే హై యహా

నా కాయిషే

యహా సిర్ఫ్ గులాబ్ కిల్తే హై

కాంటే చుబ్తే నహీ యహా
మగర్ హాత్ సే నహీ
దిల్ సే ఖూన్ నికల్తా హై

సారే అప్నే హి రహతే యహా అప్నా
పన్ తంగ్ హొగయ
కౌన్ అప్నా ,
కౌన్ పరాయా కౌన్ కిస్కా

జాన్ నా మనా హై యహా
జిందగీ జీనా హై తో
మర్ కే సీఖో యహా

*********

కల్ కిస్ కా
కిస్నే పాయా?
ఆజ్ కౌన్ క్యా యహ పాయ ?
జో మగర్ మచ్లీ హై
హమేషా దోఖా కాయా
బందర్ నె దిల్ కబీ నా లౌట్ ఆయా

షురువాత్ కబ్ కా
జాన్ నే కేలియే
జాన్ లేనేకా

ఇసీలియే మై జిందాహు
గవా దేనే కేలియే
వహి ఏక్ పురానా షాయరీ పర్మానే కేలియే....

(రచనా సహకారం మెహదీఅలీ గారు)
===================================

కె.ఎన్.వి.ఎం.వర్మ// ఒక పాత కధ //

పూలు గుబాళించవు
కోరికలూ నెరవేరవు
కానీ ఇక్కడ
గులాబీలు పూస్తాయి.

ముళ్ళు గుచ్చుకోవిక్కడ
కానీ
చేతుల్లో కాదు
గుండె నుంచి రక్తం స్రవిస్తుంది.

నాదనుకున్న లోకమే ఇది
మమతని
కోల్పోయి ఇరుకైపోయింది
నీ వాళ్ళెవరో
నా వాళ్ళెవరో, కాని వాళ్ళెవరో

తెలుకోవడం నిషేదం
జీవించడం ఏలాగో
మరణించి నేర్చుకో ఇక్కడ

రేపు ఎవరిదో
ఎందరికి దొరికేనో
ఈ రోజు ఏం మిగిల్చిందని?
మొసలి మనసు మోసపోతూనే ఉంది
కోతి
గుండె ఎప్పటికీ తీసుకురాదు.

మొదలెప్పుడో తెలుసా
తెలుసుకోవాలనుందా
హృదయం పగిలిందెప్పుడో

అందుకే బ్రతుకుతున్నాను
సాక్షం చెప్పడానికి
అదే పాత కధ
మళ్ళీ అందరికీ తెలపడానికి.....29.11.2013..

Monday 8 July 2013

//ప్రయాణం//



అర్ధ చంద్రాకారంలో
రెండు జళ్ళ మద్య
కనకాంబరాల దండ
నవ్వుతోంది అంటే
కోపంగా నీ చూపులు
విసురుగా నీ నడకలు
..........................

రాత్రి దొంగాటలాడుతూ
కొట్టు గదుల దగ్గర
మీ నాన్నకు దొరికితే
నీ కోసం వచ్చానని
కొట్టిన కవిసీకర్ర దెబ్బలూ
...........................

బుట్టలో కూర్చొబెట్టి నిన్ను
మేనమామలు తీసుకొస్తుంటే
కర్పూరం పుల్ల చూసి
పుల్ల ఐస్ కావాలని తోడిపెళ్ళికొడుకు
ఏడుపులు నీ నవ్వులు
...........................

తొలిరాత్రి మల్లెపూలు
తురుముకోమంటే జడలో
కనకాంబరాలు లేవని
అత్తగారి మీద అలిగి
నువ్వు పెట్టిన బుంగమూతి
..........................

హైదరాబాదు కొత్త కాపురం
నెలాఖరున మజ్జిగ తాగి
నిద్ర పట్టక రాత్రంతా
చెప్పుకొన్న కబుర్లు
..........................

పెద్దొడు పుట్టినప్పుడు
నీ పోలికా, నాపోలికా
ఎవరినీ వదలక తడుపుతుంటే వాడు
వేంకటేశ్వర స్వామి పేరు
పెట్టమన్న పంతులు
...........................

కూతురు సవత్త బంతికి,
ఊరంతా బంతి భొజనాలయ్యాకా,
నాకింక నగలొద్దని
నువ్వు చేసిన శపధం,
మర్నాడే రేటు పడిపొయిన బంగారం
...........................

పిల్లలిద్దరి కొత్త కాపురాలు
ప్రవాసాంద్ర విమానం
అమెరికా ఎగిరిపోయాకా,
మిగిలిన మనమిద్దరం
అవే పాత ఆశలు
............................

చిలక పలుకులు మానేసి
తీపి(sugar)గతంలో మునకేసి
నీకు లాభిస్తుందా పోగొట్టుకొని,
హైదరరాబాద్ ఎందుకురా ఎదవా?
ఆరొజు తాతయ్య కోపం(B.P)
నాకు లభించిన బహుమతి
............................

చెరుకువాడలో మొదలుపెట్టి
హైదరాబాదు గల్లీ వరకు
చెట్టాపట్టాలేసుకొని తిరిగిన
మనం ఒకే I.C.Uలో
ఇంతకన్నా ఏముంది ఆనందం
............................

అమ్మాయీ, అబ్బాయీ వచ్చారు
నినొక్కద్దాన్నే తీసుకెల్తున్నరే!
ఇదిగో వస్తున్నా ఉండు,
బొట్టు పెట్టి, మంగళ సూత్రం
ఉందో లేదో చూసి,
స్తానం చేయించి, కొత్త బట్ట కప్పి,
ఆఖరి పిడక పేర్చాకా,
వగరుస్తూ వచ్చిన వార్త విని
నాన్నా ఒక్కడివే ఆసుపత్రిలో అంటూ
ఏడుస్తాడెందుకు పిచ్చి సన్నాసి.,

పెళ్ళి నాటి ప్రమాణం కొద్దీ
నీతోనే చేస్తున్నాను కదా ప్రయాణం,
కాస్తాగు నా పార్దీవదేహం వచ్చేవరకు
ఆఖరి అగ్నికీలలో రమిద్దాం...


02.07.2013.