Friday 29 November 2013

కె.ఎన్.వి.ఎం.వర్మ//నాలోనే//

//నాలోనే//


చేను
కాలనీగా మారి
ఊరు
పట్టణం వేషం కట్టింది

ఆవు
అల్ కబీర్ చేరి
పొట్టలోని
ప్లాస్టిక్ పుట్ట బయటపెట్టింది

ప్రపంచం
వసుధైక కుటుంబంగా మారి
పక్కింటి
తలుపు మూసుకుంది

ప్రేమ
పార్కు పొదలో దూరి
అవయవాలలో
నగ్నంగా తనని చూసుకుంటోంది

మనసు
మనుషులతో పోరి
జనారణ్యంలో
అడివిని వెదుక్కోంటొంది

నేను
నాలోనే ఏమారి
నీలో
మార్పు కోసం కలగంటోంది....18.11.2013.

కె.ఎన్.వి.ఎం.వర్మ// ఏక్ పురానా షాయరీ //

కె.ఎన్.వి.ఎం.వర్మ// ఏక్ పురానా షాయరీ //


నా గుల్ కిల్తే హై యహా

నా కాయిషే

యహా సిర్ఫ్ గులాబ్ కిల్తే హై

కాంటే చుబ్తే నహీ యహా
మగర్ హాత్ సే నహీ
దిల్ సే ఖూన్ నికల్తా హై

సారే అప్నే హి రహతే యహా అప్నా
పన్ తంగ్ హొగయ
కౌన్ అప్నా ,
కౌన్ పరాయా కౌన్ కిస్కా

జాన్ నా మనా హై యహా
జిందగీ జీనా హై తో
మర్ కే సీఖో యహా

*********

కల్ కిస్ కా
కిస్నే పాయా?
ఆజ్ కౌన్ క్యా యహ పాయ ?
జో మగర్ మచ్లీ హై
హమేషా దోఖా కాయా
బందర్ నె దిల్ కబీ నా లౌట్ ఆయా

షురువాత్ కబ్ కా
జాన్ నే కేలియే
జాన్ లేనేకా

ఇసీలియే మై జిందాహు
గవా దేనే కేలియే
వహి ఏక్ పురానా షాయరీ పర్మానే కేలియే....

(రచనా సహకారం మెహదీఅలీ గారు)
===================================

కె.ఎన్.వి.ఎం.వర్మ// ఒక పాత కధ //

పూలు గుబాళించవు
కోరికలూ నెరవేరవు
కానీ ఇక్కడ
గులాబీలు పూస్తాయి.

ముళ్ళు గుచ్చుకోవిక్కడ
కానీ
చేతుల్లో కాదు
గుండె నుంచి రక్తం స్రవిస్తుంది.

నాదనుకున్న లోకమే ఇది
మమతని
కోల్పోయి ఇరుకైపోయింది
నీ వాళ్ళెవరో
నా వాళ్ళెవరో, కాని వాళ్ళెవరో

తెలుకోవడం నిషేదం
జీవించడం ఏలాగో
మరణించి నేర్చుకో ఇక్కడ

రేపు ఎవరిదో
ఎందరికి దొరికేనో
ఈ రోజు ఏం మిగిల్చిందని?
మొసలి మనసు మోసపోతూనే ఉంది
కోతి
గుండె ఎప్పటికీ తీసుకురాదు.

మొదలెప్పుడో తెలుసా
తెలుసుకోవాలనుందా
హృదయం పగిలిందెప్పుడో

అందుకే బ్రతుకుతున్నాను
సాక్షం చెప్పడానికి
అదే పాత కధ
మళ్ళీ అందరికీ తెలపడానికి.....29.11.2013..