Friday, 29 November 2013

కె.ఎన్.వి.ఎం.వర్మ//నాలోనే//

//నాలోనే//


చేను
కాలనీగా మారి
ఊరు
పట్టణం వేషం కట్టింది

ఆవు
అల్ కబీర్ చేరి
పొట్టలోని
ప్లాస్టిక్ పుట్ట బయటపెట్టింది

ప్రపంచం
వసుధైక కుటుంబంగా మారి
పక్కింటి
తలుపు మూసుకుంది

ప్రేమ
పార్కు పొదలో దూరి
అవయవాలలో
నగ్నంగా తనని చూసుకుంటోంది

మనసు
మనుషులతో పోరి
జనారణ్యంలో
అడివిని వెదుక్కోంటొంది

నేను
నాలోనే ఏమారి
నీలో
మార్పు కోసం కలగంటోంది....18.11.2013.

No comments:

Post a Comment